*ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం*
https://youtu.be/Zgzf6mPjWM8
పాట : *ముద్దుకే ముద్దొచ్చే మందారం*
చిత్రం : *ముద్దమందారం (1981)*
సంగీతం : *రమేశ్ నాయుడు*
గీతరచయిత : *వేటూరి*
నేపధ్య గానం : *బాలు*
*పల్లవి :*
మందారం... ముద్దుమందారం
మందారం... ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే ... మువ్వకే నవ్వొచ్చే
*ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం*
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
*చరణం 1 :*
అడుగులా అష్టపదులా... నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా... నడకలా జీవనదులా
పరువాల పరవళ్లు... పరికిణీ కుచ్చిళ్లూ
విరి వాలుజడ కుచ్చుల సందళ్లు
కన్నెపిల్లా కాదు... కలల కాణాచి
కలువ కన్నులా... కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
*చరణం 2 :*
పలుకులా రా చిలకలా... అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రా చిలకలా... అలకలా ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్లు
మల్లెపువ్వా కాదు... మరుల మారాణి
బంతిపువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
ముద్దమందారం ముగ్థ శృంగారం
*ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను*
పాట : *ఏ పాట నే పాడను*
https://youtu.be/VwZrjoPjhos
చిత్రం : *సీతామాలక్ష్మి (1978)*
సంగీతం : *కె.వి. మహదేవన్*
గీతరచయిత : *వేటూరి*
నేపధ్య గానం : *సుశీల, వాణీ జయరాం*
*పల్లవి :*
అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
*ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను*
ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
*చరణం 1 :*
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..
ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు ...మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను...
*చరణం 2 :*
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ..
ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
*చరణం 3 :*
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ..ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే
ఎందుకో ..ఎందుకో...నా మీద అలిగాడు చెలికాడు...
కలలు చెదిరినా పాటే... కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను...
Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT




0 Comments