S P BALASUBRAMANYAM (SRIPATHI PANDITHAARAADHYULU BALASUBRAMANYAM )
ఎస్పీ బాలసుబ్రమణ్యం(శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం ) గారికి కన్న్నీటి వీడ్కోలు శ్రద్ధాంజలి ఘటిస్తూ...🙏🌹🙏
By Team
https://youtu.be/J6jH12dLavU
ఓ అభిమాని ఊహాజనితం
అమర గాయకుని అమరలోక యాత్ర.... ఇంద్రుడు శుక్రవారం స్వర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు... ఊహించని అతిధి వస్తున్నాయరని... అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా గానా బజానా ఏర్పాటు చేయాలని ఇంద్రుడు సహచరులకు ఆదేశాలు జారీ చేశారు... ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు... కరెక్ట్ గా 1 గంట 4 నిమిషాలకు పుష్పక విమానం. ఇంద్రలోకం వచ్చింది. అందులో నుంచి ఓ వ్యక్తి మైకు, పుస్తకం చేతపట్టుకొని కిందకు దిగడం కనిపించింది.. తెలుగుదనం ఉట్టి పడేలా ఎప్పుడు నిండుగా కనిపించే ఆ వ్యక్తి 40 రోజులుగా ఆసుపత్రిలో బక్కచిక్కి పోవడంతో చాలామంది పోల్చుకోలేక పోయా రూ. అయితే అప్పటికే సభలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు,కోదండపాణి గాన గంధర్వుడు ఘంటసాల, గేయ రచయితలు, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ శ్రీ, వేటూరి వంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గుర్తుపట్టా రూ. ఆప్యాయంగా పలకరించి 50 ఏళ్లు నాటి గతాల ను గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని కలవడానికి ఇన్నాళ్లకు నీకు తీరిక అయ్యిందా. అంటూ ఆట పట్టించారు. ఇది ఇలా ఉండగా. సభలో తెలుగు మాటలు వినబడడం తో. సేదతీరుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, శ్రీదేవి వంటి అందాల నటులు వచ్చారు. ముందుగా ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, తెలుగు ప్రజలు ఏమంటున్నారు, అంటూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారు. వేటగాడు పాటలు మళ్లీ సభలో వినిపించాయి, ఏం బాలసుబ్రమణ్యం ఏమయింది, ఇలా వచ్చారు అంటూ అక్కినేని పలకరించారు వందనం అభివందనం నీ పాటకే అభివందనం సాంగ్ సభలో వినిపించింది. అందుకు తగ్గట్లు, రంభ, ఊర్వశి, మేనక, స్టెప్పులతో మైమరిపించారు. ఇది ఇలా ఉండగా సభలోకి సర్దార్ పాపారాయుడు దాసరి నారాయణరావు వచ్చారు. ఏం బాలు గారు మీరు వచ్చారా, అక్కడ తెలుగు పాటకు రిపేర్ ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలుని కలవడానికి కేంద్రం నుంచి కొంతమంది వస్తున్నారని ఇంద్రుడు కు కబురు వచ్చింది. దీంతో ద్వారపాలకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 5 గంటల కు మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ , మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ, వాజ్పేయి లు ను బాలుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాలు తాను కేంద్రం నుంచి మీ చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు అందు కున్నానని గతాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బాలు తన డిక్షనరీ లో నుంచి కొన్ని పాటలు పాడి వినిపించారు. బాలు గొంతు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు లా ఉండడంతో ఇంద్రుడు తో పాటు కొలువుదీరిన వారు ఆశ్చర్య పోయారు ఇక సభలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వరాభిషేకం, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు ఉంటాయని దేవేంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద బాలు మొదటిరోజు స్వర్గ యాత్ర బిజీబిజీగా సాగింది.
ఓ అభిమాని ఆవేదన
ఏంటయ్యా బాలు ఇలా...
అసలు ఏంటయ్యా నీకూ నాకూ ఉన్న సంబంధం?
ఏ అనుబంధం ఉంది గనక!
ఏ రక్త సంబంధం ఉంది గనక!
అసలు నువ్వు నాకు ఏమవుతావు గనక...
నన్నింతగా లొంగదీసుకున్నావ్!?!
అసలు ఎవరివయ్యా నువ్వు???
అమ్మ చేతి కమ్మని గోరు ముద్దవా... కాదే!
పసిపాపల్లో కనిపించే దైవానివా...కాదే !
నెచ్చెలి వెచ్చని కౌగిలింతవా.... కాదే !
తొలకరి పలకరింపులోని పులకరింతవా ... కాదే!
వెన్నెల గుత్తివా
మల్లెల మత్తువా
చిక్కని చుక్కవా
చక్కని చుక్కవా
ఎవరివయ్యా నీవసలు?
నువ్వదా నువ్విదా
నువ్వందులో ఉన్నావా
ఇందులో ఉన్నావా అని
నిన్ను నిలదీయలేనుకానీ...
అన్నింటా నువ్వే ఉన్నావయ్యా!
అవును... అమ్మ తోడు.
ఈ వయసులో అమ్మే గనక నాకు జోల పాడితే
"ఆపవే నీ గోల'' అంటానేమో!!
మరి నువ్వు పాడితే....
నా ఉనికినే మరచిపోయానయ్యా!
"అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమె సోపానము"
భగవద్గీతాలు, భగవద్గీతలు, కీర్తనలు పాడి భగవంతుడి స్థాయిలో ఆరాధింపబడడం ఒక అద్భుతం. గీతము గానము బాగుంటే కీర్తింపబడే వాడు కీర్తించే వాడు కూడా ఆరాధింప బడతారు. అదే అద్వైతం. అదే అమరత్వ సాధనకు తొలి మెట్టు. అమరత్వం అంటే శాశ్వతత్వం. అది భౌతికమో లోకికమో కాదు, మానసికం.
నీది మధుర గళం, పాటైనా, పద్యమైనా, విరహ గీతమైనా, వియోగ గీతమైనా, ప్రణవ గీతమైనా, ప్రణయ గీతమైనా, ప్రబోధ గీతమైనా, దేశ భక్తి గీతమైనా సందర్భోచితంగా పలికే లౌక్యం తెలిసిన గళం.
కథానాయకుడికీ, కామెడీ నటుడికీ సమానంగా పాడగల సత్తా నీ గళానికే సొంతం. ఆడవేషం వేసుకున్న హీరోకి, ఆడామగా కానీ వేషం వేసిన మాడాకి పాడే ధైర్యం నీ గళానికే ఉంది.
సినీపరిశ్రమలో తాతలకి, తండ్రులకి, మనవలకి కూడా నేపధ్య గానం చేసిన ఏకైక ఘనత నీ గళం సొంతం.
అటువంటి గళం అలసిపోయి మూగపోవడం ఏంటయ్యా బాలు?
"సర్వే జనాః సుజనో భవంతు, సర్వే సుజనాః సుఖినో భావంతు" అంటూ అందరూ మంచి వారవ్వాలి, మంచి వారందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ ఆశీర్వదిస్తూ పలికే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కాదు కాదు నిన్ను మించిన మంచి వారెవరు బాలు..
కమ్మటి గళంతో, నవతరానికి దిశానిర్దేశం చేస్తూ, సునిసిత హాస్యంతో నవ్వులు పంచుతూ ఉండే బాలు ఇక లేడా?
నీ గానం అమరం
నీ జననం దైవేచ్చ కావచ్చు
కానీ నీ జీవం మా సొత్తు
ఆ దైవం కూడా మా అనుమతి లేకుండా నీకు మాకు ఎడబాటు కల్పించ లేడు అనుకున్నాను..
నీ రాకకై వేయి కళ్ళతో,చెవులు రిక్కించుకుని,పాడుతా తియ్యగా కమ్మగా అని ఎప్పుడు అంటావా మళ్లీ అని ఎదురు చూశాను....
ఇంతలోనే ఇలా..
ఇలా ఎలా బాలు..
లేదు బాలు..లేదు...
ఎలాగోలా మాకోసం మళ్లీ పుట్టవా బాలు..
_*🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Uploaded by Chandramohan Pushpaveni Mandula*_

Disclaimer :
These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT

0 Comments