ADHI VOKA IDHILE అది ఒక ఇదిలే OLD ANR SONG LYRICS
పాట : అది ఒక ఇదిలే
చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం సారథ్యం : మాస్టర్ వేణు
గీతరచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి. బి. శ్రీనివాస్, పి సుశీల
పల్లవి
అది ఒక ఇదిలే
అతనికే తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవి చూపెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లా లా లా లా
అది ఒక ఇదిలే
అతనికే తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవి చూపెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లా లా లా లా
చరణం : 1
మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూ
అహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను
అని పలికిందిరా చెలి కులికింది రా
ఎద రగిలిందిరా మతి చెదిరింది రా
చెదిరింది రా
అది ఒక ఇదిలే ఆమెకే తగులే
అరి కొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
అది ఒక ఇదిలే
చరణం : 2
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ
అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు
మది పులకించెను మరులొలికించెనూ
నను మరిపించెను తగుననిపించెను
అనిపించెనూ
అది ఒక ఇదిలే
చరణం : 3
నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
నా వద్దున్నదే తన ముద్దన్నదీ
చే కొమ్మంది
నీ సొమ్మన్నదీ
సొమ్మన్నదీ
ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగానూ
అహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయానూ
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమయిననూ నేను తనదాననూ
తనదాననూ
అది ఒక ఇదిలే
అతనికే తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవి చూపెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లా లా లా లా
WATCH VIDEO SONG
Aaa
SWARANEERAJANAM SITE REQUEST
SWARANEERAJANAM REQUEST YOU TO PLEASE SHARE YOUR FAVOURITE SONG LYRICS
Disclaimer :
Our Website Provide Hit Songs Lyrics In Telugu, English, Hindi Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.
Thanks For Giving Support By SUBSCRIBE
PLEASE SHARE AND COMMENT


0 Comments