ముద్దుకే ముద్దొచ్చే..
చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు మందారం..

https://youtu.be/Zgzf6mPjWM8


ముద్దు మందారం... మందారం..
ముద్ద మందారం...
ముద్దుకే ముద్దొచ్చే... మువ్వకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం

అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరి వాలు జడ కుచ్చుల సందళ్ళు...
కన్నె పిల్లా.. కాదు కళల కాణాచి
కలువ కన్నులా.. కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం

పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా.. కాదు మరుల మారాణి
బంతి పువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం



Disclaimer  : 

These Website Provide Hit Songs Lyrics In Telugu, English Font For Educational, Promotional Purpose Only. All Audios / Videos / Lyrics / Images Are The Property Of Their Respective Copyright Owners.

Thanks For Giving Support By SUBSCRIBE

PLEASE SHARE AND COMMENT