ఎస్ వరలక్ష్మి (13-08-1926 & 22-09-2009) ఎస్ వరలక్ష్మి గారి 94 వ జయంతి ఈ రోజు. అలనాటి నటి, గాయని, నిర్మాత
ఎస్ వరలక్ష్మి (13-08-1926 & 22-09-2009)
ఎస్ వరలక్ష్మి గారి 94 వ జయంతి ఈ రోజు.
అలనాటి నటి, గాయని, నిర్మాత ఎస్ వరలక్ష్మి 1926 సంవత్సరం కాకినాడ దగ్గరున్న జగ్గంపేటలో జన్మించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు పుట్టేరు. అందుకే ఆమెకు వరలక్ష్మి అనే పేరు పెట్టారు. తండ్రి పేరు సరిదె నాలాచలం నాయుడు. ఎస్ వరలక్ష్మి నాలుగవ ఏట ఆమె పెత్తల్లి (తల్లి అక్క) కర్నూలుకు తీసుకు పోయి పెంచుకుది. ఎస్ వరలక్ష్మి పెద్ద నాన్న కె రంగయ్యనాయుడు ఆమెకు స్వయంగా సంగీతం నేర్పేరు. ప్రముఖ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్‌ను (కణ్ణదాసన్ తమ్ముడు) పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె (నళిని) ఉన్నారు.
యస్.వరలక్ష్మి గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టేరు. మొదటి చిత్రం ‘బాలయోగిని’ (1937) తర్వాత ‘రైతుబిడ్డ’ (1939), ‘శాంత బాలనాగమ్మ’ (1942) , ‘మాయాలోకం’ (1945), ‘పల్నాటి యుద్ధం’1947 , బాలరాజు (1948), జీవితం (1949), వాలి సుగ్రీవ (1950), స్వప్నసుందరి (1950), సౌదామిని (1950), సతీ సక్కుబాయి (1954), కనకతార (1956), సతీ సావిత్రి (1957), అభిమానం (1960), కృష్ణ ప్రేమ 1961, ఆదర్శ కుటుంబం (1969), ప్రేమనగర్ (1971), బొమ్మా బొరుసా (1971), బాలభారతం (1972), అభిమానవతి (1975), గుణ (1992), దీపావళి 1960, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960), మహామంత్రి తిమ్మరుసు (1962), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), లవకుశ (1963), భబృవాహన (1964), సత్య హరిశ్చంద్ర (1965), శ్రీకృష్ణ పాండవీయం (1966), ఉమ్మడి కుటుంబం 1967, శ్రీకృష్ణావతారం (1967), శ్రీ కృష్ణ తులాభారం 1967, భామా విజయం (1967), శ్రీ కృష్ణ సత్య 1971, దేవుడు చేసిన మనుషులు 1973, దాన వీర శూర కర్ణ 1977, సర్దార్ పాపారాయుడు 1980, వయ్యారిభామలు వగలమారి భర్తలు 1982
మొదలైన తెలుగు సినిమాలతో బాటు అనేక తమిళ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమె హీరోయిన్ గా ఆఖరు చిత్రం విజయా వారి సత్య హరిశ్చంద్ర 1965. ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చాలాసినిమాలు చేసారు. తెలుగులో ఆమె ఆఖరు చిత్రం ముద్దుల కృష్ణయ్య 1986, బాల కృష్ణకు అత్తగా గొల్లపూడి మారుతీరావు సరసన నటించారు.
కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి ‘వరలక్ష్మీ పిక్చర్స్’ ప్రారంభించి తొలిసారిగా ‘సతీ సావిత్రి’ (1957) నిర్మిం చేరు. మంగళంపల్లి బాలమురళీకృష్ణను సినిమారంగానికి పరిచయం చేసిన చిత్రమిది. ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం ఈ సినిమా విశేషం.
నరకాసురుని భార్యగా – దీపావళి
శ్రీ దేవిని – శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
వరాల బేరమయ్యా – శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
తిరుమల తిరుపతి – మహా మంత్రి తిమ్మరసు
స్పష్టతకి శ్రావ్యత చేరితే ఆ పాట కలకాలం నిలుస్తుందన్నదానికి ఉదాహరణ, తిమ్మరుసు చిత్రంలో “లీలా కృష్ణా” పాట. (మహా మంత్రి తిమ్మరసు ). ఈ పాట చివర్లో “మైమరిచిన చెలి మాటే లేదని – ఓరగ చూస్తూ ” అనే చోట విరుపులతో పాడడం వినడానికి తేలికగా అనిపించినా పాడడం మాత్రం సులభం కాదు.
“అలక ఏమో అని దరి రాకుండిన జాలిగా చూసేవేలనో” అన్న వాక్యం లో జాలి అనే పదాన్ని పలికిన తీరు నభూతో భవిష్యతి.
సత్య భామగా – అలిగితివా సఖీ – శ్రీ కృష్ణార్జున యుద్ధం
సత్య భామగా – వేయి శుభములు కలుగు నీకు – శ్రీ కృష్ణార్జున యుద్ధం
ఎస్ వరలక్ష్మి చేతిలోంచి త్రిశూలం తీసుకుని శ్రీ రాముడి మీదకు యుద్ధానికి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం వస్తుంది ఈ పద్యం వింటే.
భూదేవి గా – రాజట రాజ ధర్మమట – లవ కుశ
చిత్రాంగద గా – నీసరి – భబృవాహన
చంద్రమతిగా – నమో భూత నాధ – సత్య హరిశ్చంద్ర (ఈ సినిమా నాటకం గా తీయకుండా సినిమాగా తీయడమొక్కటే నిర్మాతల తప్పు!)
చంద్రమతిగా -అందాల – సత్య హరిశ్చంద్ర
సత్య హరిశ్చంద్ర
కుంతీదేవి గా – శ్రీ కృష్ణ పాండవీయం
కుంతీదేవి గా – శ్రీ కృష్ణ పాండవీయం
కుంతీదేవి గా – శ్రీ కృష్ణ పాండవీయం
ద్రౌపది – శ్రీ కృష్ణావతారం
శచీదేవి గా – శ్రీ కృష్ణ తులాభారం
కుంతిగా కర్ణుడిని వరమడగే సన్నివేశం – దాన వీర శూర కర్ణ
ఎదురాయనే , బభ్రువాహన

0 Comments