అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ….. Sridevi biography & videos Post author By Mc Mohan Post date August 13, 2020

 

Categories
UNCATEGORIZED

అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ….. Sridevi biography & videos

అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ…..

Sridevi biography

జననం 13 ఆగస్టు 1963
మరణం 24 ఫిబ్రవరి 2018

🎼🎞️📲BOLLYWOOD CLASSICS💽🎧
( *OLD & NEW HINDI SONGS ONLY*)

*Follow this link to Join and Add members in my WhatsApp group*:

🎼🎞️📲 GOLDEN BOLLYWOOD COLLECTIONS💽🎧
*OLD and NEW Songs*
https://chat.whatsapp.com/KnR2HaurgMgCKxtgLJRyuU

Group By *Mohan*
భారతీయ సినీ నటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించింది.
వ్యక్తిగత జీవితం
ఆమె తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ఆమె లమ్హె అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రిగారు, జుదాయి అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు. హిందు సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది.
తరువాతి కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకొన్నది. వారిరువురికి జాన్వి, ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


శ్రీదేవి మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి. ఆమె తల్లి రాజేశ్వరమ్మ సొంతూరు తిరుపతి.
తాత కటారి వెంకటస్వామిరెడ్డి తిరుపతి-గ్యారపల్లి-జమ్మలమడుగు మధ్య బస్సులు నడిపేవారు. ఆయన జమ్మలమడుగులో నర్సుగా పనిచేస్తున్న వెంకటరత్నమ్మను ప్రేమించి కులాంతర (బలిజ) వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రుయా ఆసుపత్రిలో ఉద్యోగం సంపాదించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం కాగా, తర్వాత రాజేశ్వరమ్మ, సుబ్బరామయ్య, అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మ జన్మించారు. అందరూ తిరుపతిలోని 93-టీకే వీధిలోని ఇంట్లో ఉండేవారు. బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో ఉద్యోగం సంపాదించారు.

తనవెంట తమ్ముడు, చెల్లెళ్లందర్నీ చెన్నై తీసుకెళ్లాడు. రాజేశ్వరమ్మకు సినీ నటి కావాలన్న తపన ఉండేది. మిగతా వాళ్లంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆమె నటిగా ప్రయత్నిస్తూ రంగారావు అనే చిన్నస్థాయి నటుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి సూర్యకళ అనే కుమార్తె కలిగింది. రంగారావు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. అనంతరం రాజేశ్వరమ్మ శివకాశికి చెందిన తెలుగువాడు అయ్యప్పన్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యకళను అమ్మమ్మ, తాతయ్యలు తెచ్చి పెంచుకున్నారు. అప్పటికే అయ్యప్పన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. అయ్యప్పన్‌రెడ్డి చెన్నైలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసేవారు. ఆయన తన భార్యను ఒప్పించి రాజేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.


రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు… శ్రీదేవి, శ్రీలత కలిగారు. అయ్యప్పన్‌రెడ్డి మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుడే ఇంటి వ్యవహారాలు చూసుకొనేవాడు. శ్రీదేవి దక్షిణాదిన తారాపథంలో దూసుకుపోతున్నపుడు కూడా అన్న చెప్పినట్లే నడుచుకొనే వారు. శ్రీలతను మధురైకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజీవ్‌కు ఇచ్చి పెళ్ళి చేశారు. శ్రీదేవి అక్క సూర్యకళను రాజేశ్వరమ్మ మేనత్త కుటుంబంలో (ఎ.రంగంపేట) ఇచ్చి వివాహం చేశారు. సూర్యకళ కుమార్తె గులాబీ సినిమా హీరోయిన్‌ మహేశ్వరి. ఎ.రంగంపేటలో 1970లో శ్రీదేవి పది రోజులపాటు గడిపిందట. శ్రీదేవిని పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి పిన్ని అనసూయమ్మే పెంచింది. ఇప్పుడామె తిరుపతిలో ఉన్నారు.

శ్రీదేవి ఏటా ఆగస్టు 13న పుట్టినరోజును తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో జరుపుకొనే వారు. శ్రీదేవి పిన్ని కుమార్తె ప్రసన్నలక్ష్మి స్విమ్స్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌. శ్రీదేవి తిరుపతి వస్తే ఆమె ఇంట్లోనే ఉండేవారు. శ్రీదేవికి బోనీకపూర్‌తో వివాహం జరిగినప్పటి నుంచి శ్రీదేవికి బంధువులతో ఎడం పెరిగింది. తల్లి రాజేశ్వరమ్మ బ్రెయిన్‌ ఆపరేషన్‌ సమయంలో జరిగిన పొరపాటుకు అమెరికా ఆసుపత్రి నుంచి భారీ పరిహారం వచ్చింది. దాని విషయంలో శ్రీదేవి, శ్రీలత మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తర్వాత ఒక్కటయ్యారు. గత పదేళ్లలో మహేశ్వరి వివాహంతో పాటు మరికొన్ని వేడుకలకు మాత్రమే శ్రీదేవి వచ్చారు.

నట జీవితం బాలనటిగా శ్రీదేవి
శ్రీదేవి ఒక అగ్ర కథానయక. శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణై (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టినది.ఐతే 1975 లో విజయచిత్ర అని ఒక ఒక తెలుగు పత్రికకు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాను తుణైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రం అని చెప్పింది.1976 లో బాలచందర్ చిత్రం “మూండ్రు ముడిచ్చు”లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తరువాత, శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో (కమల్ హాసన్, రజనీ కాంత్) కలిసి నటించారు.1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక.


అదే సమయంలో, శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయకిగా కొనసాగింది. దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు గారితో, ఆమె
.

కొండవీటి సింహం,

వేటగాడు,

సర్దార్ పాపారాయుడు,

బొబ్బిలిపులి

మొదలగు చిత్రాలలో నటించారు.నాగేశ్వరరావు గారితో, ఆమె

ముద్దుల కొడుకు,

ప్రేమాభిషేకం,

బంగారు కానుక,

ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ/కృష్ణ గారితో కలిసి ఆమె

కంచుకాగడా,

కలవారి సంసారం,

ఘరానా దొంగ ,


కిరాయి కోటిగాడు

బుర్రిపాలెం బుల్లోడు

బంగారు కొడుకు

మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆదిలో, ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు, వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి, ముఖ్యంగా కె. రాఘవేంద్ర రావు గారు, కె.బాపయ్య గారు దర్శకత్వం వహించినవి.

1978 లో, శ్రీదేవి మొదటి హింది చిత్రం “సోల్వా సావన్” అమోల్ పాలేకర్ తో కలిసి నటించారు, ఆ చిత్రం విజయవంతం కాలేదు. కాని, ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం

“హిమ్మత్వాలా”

మంచి విజయం సాధించింది. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో (star) అయిపొయారు.

జానుబాజ్

ఆమె తదుపరి చిత్రం
“సద్మ”

ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980 లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని, “నగీన”,

“మిస్టర్ ఇండియా”,

“చాందిని”,


“చాల్ బాజ్” మొదలగు చిత్రాలు. చాల్ బాజ్ చిత్రానికి హగానూ ఆమెకి మొదటి ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు “మిస్ హవ హవాయి” (Miss Hawa Hawai)

అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాప్లిన్గా మరువలేని నటనా ప్రతిభ కనబరిచారు.

“చాందిని”


చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు.

యాష్ చోప్రా ఆమెతో “చాందిని”

చిత్రం తరువాత “లమ్హే” (1991)


చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గానూ ఆమె రెండవ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు, ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి (International Best Actress Award) పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

“ఖుదా గవా”,

“గుమ్రా” చిత్రాలలో ఆమె నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. “హాలీవుడ్”లో ప్రఖాతి గాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg), ఆమెతో సినిమా తీయదలచి, ఆమెను సంప్రదించారు. కాని సమయం లేని వలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం “రూప్ కీ రాణి చోరో కా రాజా” అపజయం అయ్యింది. విజయవంతమైన చిత్రం “జుదాయి” (1997) తరువాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తరువాత ఆమె, “బోనీ కపూర్”ని వివాహమాడారు. ఇప్పుడు ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. ఆమె కూతుళ్ళ పేర్లు “జాన్వి”, “ఖుషి”.

ఆరేళ్ళ విరామం తరువాత ఆమె సహార ఛానల్ లో ప్రసారింప బడిన “మాలినీ అయ్యర్ (2004 – 05)” అను సీరీయల్ లో నటించారు. అంతే కాకుండా, కరిష్మా కపూర్ నిర్వహించే “జీనా ఇసికే నామ్ (2004)” అనే కార్ర్యక్రమంలో కూడా అతిధిగా కనిపించారు. “కాబూమ్ (2005) అనే నృత్య పోటీలకు ఒక రోజు న్యాయనిర్నేతగా వ్యవహరించారు.

2007 ఫిబ్రవరి 24 న, 52 వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల ప్రధానం రోజున, ఆమె నర్తించి మెప్పించిన 80 లలోని కొన్ని పాటలకు, మరల నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు.

Sridevi Last journey

_*🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Posted by Chandramohan Pushpaveni Mandula*_
*TELEGRAM LINKS JOIN &ADD MEMBERS*
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
_*Share & Comment*_

Leave a Reply

Logged in as Mc MohanLog out?

 

Post a Comment

0 Comments