కనువిందు చేసే సుందర అభినేత్రి కాంచన గారికి 81వ జన్మదిన శుభాకాంక్షలు Kanchana (Actress) biography & Songs Videos Post author By Mc Mohan Post date August 16, 2020

 

Categories
UNCATEGORIZED

కనువిందు చేసే సుందర అభినేత్రి కాంచన గారికి 81వ జన్మదిన శుభాకాంక్షలు Kanchana (Actress) biography & Songs Videos

కనువిందు చేసే సుందర అభినేత్రి కాంచన గారికి 81వ జన్మదిన శుభాకాంక్షలు

Kanchana (Actress) biography

పరిచయము
కాంచన, తెలుగు సినిమా నటి. సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరత నాట్యము మరియు సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. తెలుగు , తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు .

వ్యక్తి గత వివరాలు:
• పేరు : కాంచన ,
• అసలు పేరు : వసుందరా దేవి .,
• జననం : 16-08-1939 మద్రాసులో. వారి కుటుంబం మొదటగా విజయవాడ. అటుపిమ్మట మద్రాసులో స్తిరపడిపోయారు.
• వృత్తి: మొదట ఎయిర్ హోస్టెస్గా అటుపిమ్మట సినీ నటిగా
• పెళ్లి : కాలేదు .. బ్రహ్మ చారిణి గా ఉండిపోయారు ,
• నివాసము : బెంగళూరు ,
కెరీర్ :

ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది.

1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.

మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన ‘గజ్జె పూజ’. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు.

ఎన్నో సినిమాల లో వివిధ భాషల లో నటించి గడించిన డబ్బును కుటుంబ సభ్యులు మోసం చేసి తీసుకోవడం జరిగినది .కన్న తండ్రి తల్లితో కలిసి సంతకాలు చేయించుకుని ఆస్తిపాస్తులను మొత్తం సంపాదనను కాజేసి ఇక్కట్ల పాలు చేస్తే నిర్ఘాంతపోయి కోలుకోలేకపోయింది కాంచన. చెల్లెలు గిరిజ, ఆమె భర్త పాండేల మద్దతుతో కోర్టులో విజయం సాధించింది చాలా కాలం తరువాత తల్లిదండ్రుల చర్య వలన కలిగిన మనస్తాపం దైవచింతన, ధ్యానం వైపు మళ్లిందామె. బెంగళూరులో చెల్లెలు వద్దనే వుంటున్న కాంచన కోర్టు నుంచి చెన్నై టి. నగర్లోని 15 కోట్లు విలువ చేసే 1600 చ.గ. ఆస్తిని స్వాధీన పరుచుకుని తిరుమల తిరుపతి దేవస్థానంకి 25.10.2010న దఖలు పరిచి ఆస్తిపాస్తులపై మమకారం లేదని వెల్లడించింది.


. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్రస్తుతం బెంగులోర్ లో నివాసము ఉంటున్నారు . ఆధ్యాత్మిక భజనలు, యోగా , పూజలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అవేకళ్ళు చిత్రం పాట

చిత్రమాలిక : కొన్ని సినిమాలు .
• మళ్లేశ్వరి – లో బాలనటిగా 9 యేళ్ళ వయసులో నటించారు.
• గాంధర్వం (1993)
• వక్త్ కా షెహెన్షా (1987)
• శ్రీ దత్త దర్శనం (1985)
• ఆనంద భైరవి (1984)
• గడసరి అత్త సొగసరి కోడలు (1981)
• సిగప్పు రోజాక్కళ్ (1978)
• ఇంద్రధనుస్సు (1977)
• మహాకవి క్షేత్రయ్య (1976)
• సెక్రటరీ (1976)
• ప్రేమనగర్ (1974)
• భక్త తుకారాం (1973)

• దేవుడు చేసిన మనుషులు (1973)

• కళ్యాణ మండపం (1971)

• ధర్మదాత (1970)

• భలే మాష్టారు (1969)

• నాటకాల రాయుడు (1969)

• నేనంటే నేనే (1968)


• తీన్ బహురాణియా (1968)
• అత్తే కంగళ్ (1967)
• ఫర్జ్ (1967)
• ప్రాణమిత్రులు (1967)

• ప్రైవేటు మాస్టారు (1967)

• తంగై (1967)
• నవరాత్రి (1966)

• ఆత్మ గౌరవం (1965)

• వీరాభిమన్యు (1965)

• మంచి కుటుంబం (1965)

• ప్రేమించి చూడు (1965)


• కాదళిక్క నేరమిల్లై (1964)
• సువర్ణ సుందరి (1957)

_*🎼🎬🎥📟📀Audio & Video Songs With Lyrics🎼🎧Posted by Chandramohan Pushpaveni Mandula*_
*TELEGRAM LINKS JOIN &ADD MEMBERS*
TELUGU SONGS Group
https://t.me/sumadhurageethalump3
TELUGU SONGS Group
https://t.me/swaraneeraajanam
Only Telugu & Hindi Songs Of SP BALU & KJ YESUDAS Group
https://t.me/spbaluandyesudasallsongs
OLD and NEW HINDI songs Group
https://t.me/bollywoodclassiccollections
_*Share & Comment*_

Leave a Reply

Logged in as Mc MohanLog out?

 

Post a Comment

0 Comments